11 ఎకరాల్లో జీడితోట దగ్ధం | Sakshi
Sakshi News home page

11 ఎకరాల్లో జీడితోట దగ్ధం

Published Fri, Apr 19 2024 2:05 AM

కాలిపోయిన జీడితోట - Sakshi

రావికమతం : కొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి మణి, శాంతి, రమణమ్మ, తంటపురెడ్డి జయ, వెచ్చా కొండమ్మ అనే ఐదుగురు రైతులకు చెందిన 11 ఎకరాల్లోని జీడి తోట ప్రమాదవశాత్తూ గురువారం కాలిపోయింది. ఆకతాయిలు, మందుబాబులు ఆ తోటల్లో తరచూ పార్టీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా సిగరెట్లు కాలుస్తూ నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. పలుమార్లు అటువంటి ఆకతాయిలను ఆ రైతులు మందలించారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్‌ అంటుకుని ఆ రైతులకు చెందిన జీడితోట కాలిపోయింది. మండే ఎండ ఆపై గాలి వీయడంతో తోటను రక్షించుకోలేకపోయామని రైతులు వాపోయారు. రావికమతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లేకుంటే మరో 15 ఎకరాలకు మంటలు అంటుకుని ఉండేవన్నారు. ఈ ప్రమాదంలో బాధితులకు రూ. 6లక్షల వరకూ ఆస్తి నష్ట సంభవించిందని ప్రాథమిక అంచనా. ఈ ఏడాది జీడి బాగా కాసిందని రెండు రోజుల నుంచే పిక్క ఏరుతున్నామని ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన చెందారు.

Advertisement
Advertisement