ఎట్టకేలకు విద్యార్థిని కేజీహెచ్‌కు తరలింపు | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు విద్యార్థిని కేజీహెచ్‌కు తరలింపు

Published Fri, Apr 19 2024 2:05 AM

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ అరుణ్‌ కిరణ్‌, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి  - Sakshi

చింతపల్లి రూరల్‌: ఉన్నత వైద్యానికి నిరాకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి విశాఖ కేజీహెచ్‌కు తరలించేలా చర్యలు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కిటుమల పంచాయతీ పులిగొంది గ్రామానికి చెందిన కొర్రా సిద్ధు అంజలి శనివారం పంచాయతీ జాజులపాలెం గిరిజన సంక్షేమశాఖ బాలురు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని శరీరం పొంగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు తాజంగి పీహెచ్‌సీకి మంగళవారం తీసుకువచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించారు. పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఉన్నత వైద్యం అందించేందుకు ఆస్పత్రి వైద్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారమిచ్చారు. అయితే కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు వారు సుముఖత తెలపలేదు. వెంటనే ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి తల్లిదండ్రులకు గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో విద్యార్థి సిద్ధును కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు.

తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్‌

Advertisement
Advertisement