1200 మందికి ‘గొర్రెల’ డీడీలు వాపస్‌ | Sakshi
Sakshi News home page

1200 మందికి ‘గొర్రెల’ డీడీలు వాపస్‌

Published Sun, May 26 2024 2:40 AM

-

కై లాస్‌నగర్‌: సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం గొల్ల, కుర్మలు చెల్లించిన డీడీలను ప శుసంవర్ధకశాఖ తిరిగి వారికి అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను అ ందించేందుకు సుముఖంగా లేకపోవడం, తమ డీడీలు తమకు తిరిగి ఇచ్చేయాలంటూ గొల్ల, కుర్మలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా పశుసంవర్దకశాఖ అధికా రులు వాటిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. డీడీలను వెనక్కి ఇచ్చే ప్రక్రియ ఇటీవల ప్రారంభించగా అది కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1200 మందికి డీడీలను తిరిగి అందజేసినట్లుగా జిల్లా ఇన్‌చార్జి పశుసంవర్ధకశాక అధికారి కిషన్‌ తెలిపారు. మరో 512 మంది మిగిలి ఉన్నారని త్వరలోనే వారికి కూడా ఇచ్చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement