-
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్‌మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్నచూపు చూసినపుడు జగన్‌కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్ లక్ష్మీ.2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజయమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అనుభవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్ జగన్‌ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్‌ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకెలా మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్‌ను తిడుతున్నారు."న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement