-
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్‌లోని చామ్కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్‌పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్‌ఫామ్‌కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
రేపే ఎన్నికలు.. సిద్ధంగా హెలికాప్టర్లు! ఎందుకంటే..
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాద రహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు. "అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వాల్‌లో, మరొకటి కుమావోన్లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అంబులెన్స్‌ల నంబర్లను అందుబాటులో ఉంచాం" అని ఆయన పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మొత్తం ఐదు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement