-
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
ఐఫోన్ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!
దొంగతనాలకు గురైన ఐఫోన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. యాపిల్ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. థెఫ్ట్ ఇన్సూరెన్స్‌తో ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్‌ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌కు అప్పీల్ చేసింది. దొంగతనానికి గురైన ఫోన్‌ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్‌షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్‌కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement