-
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్‌లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
Cutest Snakes AI Photos: ఈ పాములు ఏంట్రా బాబు ఇంత ముద్దుగా ఉన్నాయ్ (ఏఐ ఫోటోలు)
-
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్‌గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్‌గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement