-
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్‌తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
మళ్లీ మెరిసిన పసిడి, వెండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల భయాలతో పసిడి, వెండి పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధోరణులకు తగ్గట్లు దేశీయంగా వెండి, బంగారం ధరలు మంగళవారం మరో రికార్డు స్థాయిని తాకాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం దేశ రాజధానిలో ఉదయం పసిడి 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన రూ. 73,750ని తాకింది. అదే విధంగా వెండి ధర కూడా కేజీకి రూ. 800 పెరిగి రూ. 86,500 స్థాయిని తాకింది. ఎంసీఎక్స్‌లో జూన్ కాంట్రాక్టు ధర ఇంట్రా–డేలో రూ. 72,927 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్‌లో ఔన్సు (31.1 గ్రాముల) పసిడి ధర 15 డాలర్లు పెరిగి 2,370 వద్ద ట్రేడయ్యింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం బులిష్‌గానే ఉండనున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. -
రామ్‌ల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యాక రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భకులు తరలివస్తున్నారు. వీరు ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్లైన్లో ప్రసాదాన్ని తెప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది. ఈ నాణెం ధర రూ. 5,860. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. దీనిని ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చని, లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని ట్రస్ట్ తెలిపింది. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యకమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్‌జర్గాల్ డొల్గొర్‌జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
బంగారం కొనుగోలు దారులకు ‘భారీ’ శుభవార్త
బంగారం కొనుగోలు దారులకు భారీ శుభవార్త. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.760 తగ్గాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement