-
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. -
ధ్యానంతోనే మనస్సు నియంత్రణ
సాక్షి, హైదరాబాద్/నందిగామ: ధ్యానంతోనే మనస్సు నియంత్రణలో ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచశాంతికి మొదటగా మనలో మనం మార్పు చెందాలని, అనంతరమే ఇతరుల్లో మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యక్తులంతా నిస్వార్థంగా పనిచేస్తే మానవాళి సరైన మార్గంలో నడిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని సర్వమతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒక చోటకు తీసుకురావడం, అందరూ శాంతికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. అన్ని మతాల్లోని వారిని చైతన్యం చేయడమే ఆధ్యాత్మిక చైతన్యమని, ఎలాంటి వివక్షకు తావులేకుండా ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వశాంతికి ఈ సమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. బుద్ధుడు, జగద్గురు శంకరాచార్య, కబీర్, సంత్ రవిదాస్, గురునానక్‌తోపాటు స్వామి వివేకానంద ప్రపంచానికి ఆధ్యాత్మిక సారం అందించారని రాష్ట్రపతి గుర్తుచేశారు. మహాత్మగాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలను సమగ్రపరిచారని, అందుకే అయన్ను సబర్మతీ సంత్ అని పిలుస్తామన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని íపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు ఒకే వేదికపైకి రావడం హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ దాజీ గొప్పదనం అని ఆమె కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ మాట్లాడుతూ ప్రపంచానికి 21వ శతాబ్దంలో ఆర్థికపరంగా, ఆధ్యాత్మికంగా మన దేశం మార్గదర్శకంగా నిలుస్తుందని వందేళ్లకు పూర్వమే స్వామి వివేకానంద జోస్యం చెప్పారన్నారు. రామచంద్రమిషన్ అధ్యక్షుడు కమలేశ్ డీ పటేల్ (దాజి) మాట్లాడుతూ మతాలకతీతంగా మానవజాతి దృఢంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో అపోలో ఆస్పత్రుల సీఎస్ఆర్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజలు నిరంతరం జీవితంతో పోరాడే ఒత్తిడిలో ఉన్నారని, వారి జీవితం మారాలంటే సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని సూచించారు.చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి మనసు ప్రేమమయం కావాలని, ప్రతి పువ్వు మధురమైన మకరందాన్ని నింపుకున్నట్టు ప్రతి మనిషి ప్రేమ తత్వాన్ని మనసులో నింపుకోవాలన్నారు. అంతకు ముందు ద్రౌపది ముర్ముకు కాన్హా శాంతివనం గురుజీ కమ్లేష్ పటేల్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఓ మొక్క నాటారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామీగౌరంగదాస్, స్వామీ చిదానందసరస్వతి, స్వామి ముకుందానంద, యోగి నిరంజన్‌దాస్, నమ్రముని మహరాజ్ దాస్, దాజీ, దేవి చిత్రలేఖ, తారాచంద్ కంటాలే, డాక్టర్ భవానీరావు, దిల్షాద్, టోనీలాడర్, అభ్యాసీలు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం శంషాబాద్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంపయీ సొరేన్ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్‌లోనే ఉంటారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
HYD: విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండ్రోజులుగా ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు ప్రయాణికులు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ,మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైజాక్ కలకలం
శంషాబాద్: ఓ తప్పుడు ఈ మెయిల్ సందేశంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. మరి కొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకునే విమానం సైతం రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 8 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–951 విమానం 111 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో టేకాఫ్ తీసుకునే సమయంలో ఎయిర్‌పోర్టుకు ఈ మెయిల్లో ఓ సందేశం వచ్చింది. అందులో బాదినేని తిరుపతయ్య అనే వ్యక్తి ఐఎస్ఐకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని అతడు కాసేపట్లో విమానాన్ని హైజాక్ చేయనున్నాడని సాధ్యమైతే వెంటనే అతడిని ఆపాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అతడికి సహకరించే వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలోకి వెళ్లి ప్రయాణికులందరి తనిఖీ చేశారు. ప్రయాణికులను అందులోంచి దించి వేసి, విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. మెయిల్లో పేర్కొన్న తిరుపతయ్యతో పాటు వినోద్‌కుమార్, రాకేష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దుబాయ్ మీదుగా వీరు ఇరాక్ వెళుతున్నట్లు సమాచారం. తిరుపతయ్యతో సన్నిహితంగా ఉండే ఓ మహిళే అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు మెయిల్ పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెయిల్ ఉన్న సమాచారం నిజం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది...? ఎవరు పంపారు..? అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. మెయిల్ పంపిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాంచందర్‌రావు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement