-
ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడాన్ని అమిత్ షా తప్పు పట్టడం శోచనీయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో బోధనపై ఇంతలేసి మాటలంటున్న అమిత్ షా, ఇతర నేతల పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీశారు. సజ్జల ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు భాషను చంద్రబాబు ఉద్ధరించిందీ లేదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గించిందీ లేదు. ఇంకా సీఎం జగన్ తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే 94 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి బిడ్డలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని ఆకాంక్షించారు. కానీ, ఇంగ్లిష్ మీడియం పేదల పిల్లలకు అందని ద్రాక్షలా మారింది. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలంటే భారీగా అప్పులు చేయాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్ ఈ దుస్థితి నుంచి వారిని బయటపడేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. నాణ్యమైన విద్యను హక్కుగా అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయినా ఎక్కడైనా తెలుగు ప్రాభవం తగ్గిందా? ఇళ్లలో తెలుగులో మాట్లాడుకోవడం మానేశారా? ఎంత ఇంగ్లిష్ నేర్చుకున్నా మన తల్లిభాష ఎక్కడికిపోదు. ఇంగ్లిష్ మీడియాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మాఫియా అడ్డుకుంటోంది. అట్టడుగు, వెనుకబడిన వర్గాల వారు తమతో సమానంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని పెత్తందార్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సామాన్యులకు ఇంగ్లిష్ అందుబాటులోకి వస్తే పెత్తందార్లకు మాతృ భాషపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది. ఈ పెత్తందార్లందరూ కుటుంబ సభ్యులతో తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషల్లో మాట్లాడుకుంటారు. విద్యా రంగంలో సీఎం జగన్ సంస్కరణల కారణంగా మన విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగారు’ అని చెప్పారు.పోలవరం పాపాలు చంద్రబాబువే..బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం చంద్రబాబు స్క్రిప్టునే వల్లెవేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. భూ దోపిడీలకు కేరాఫ్ అయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై అవినీతి బురద జల్లడం సరికాదని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చకపోగా.. మరోసారి ఏ ముఖం పెట్టుకుని జట్టు కట్టారని నిలదీశారు.బాబు పాపాల వల్లే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా పిండేస్తున్నారని 2019లో ప్రధాని మోదీ యే చెప్పలేదా అని నిలదీశారు. ‘2017లో బాబు పోలవరం కాంట్రాక్టర్‌ను తప్పించి, రామోజీరావు వియ్యంకుడుకి చెందిన నవయుగకు కట్టబెట్టారు. 2013 – 14 రేట్లకు పనులు చేస్తామని కాంట్రాక్టర్ ఒప్పుకున్నా, ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా చంద్రబాబు 2015–16 రేట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. మట్టి పనులే చేసి కోట్లు దోచేశారు. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు. కాఫర్ డ్యాం సగం కట్టి వదిలేశారు.దీంతో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. పనులు జాప్యానికి ఇదే కారణం. దీనికి బాబే బాధ్యుడు. సీఎం జగన్ పోలవరంలో రూ.850 కోట్లు ఆదా చేశారు. స్పిల్‌వే పూర్తి చేశారు. డయా ఫ్రం వాల్ మరమ్మతులు చేస్తే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు. కేంద్రం నిధులు సరిగా ఇస్తే సీఎం జగన్ రెండేళ్లకంటే ముందే పూర్తి చేసి చూపిస్తారు. సీఎం జగన్ కేంద్రం నిధులు ఇచ్చే వరకు చూడకుండానే పోలవరం పనులు చేశారు.ఇప్పటికీ కేంద్రం నుంచి రూ.2,700 కోట్లు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. కూటమి కట్టడంతోనే రాష్ట్రానికి అన్యాయం మొదౖలెంది. ఈ ఏడాది మార్చి 7కి పోలవరం ఫేజ్–1 కింద మొత్తం రూ. 12,900 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించి నప్పటికీ, టీడీపీ–జనసేనతో బేజీపీ పొత్తు కుదరడంతో ఆ నిధులు ఆగిపోయాయి. షా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు.. విభజన చట్టంలోనే కేంద్రం పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. ఇదేమీ దానం, ధర్మం కాదు’ అని చెప్పారు.లెక్కలు చూసుకోండి..‘సీఎం జగన్ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ. 34 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను మార్చారు. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు. ప్రతి రూపాయికీ లెక్కలున్నాయి. అవినీతికి, వివక్షకు తావులేని పాలన చేస్తుంటే అవినీతి ముద్ర ఎలా వేస్తారు? ప్రభుత్వం చేసిన ప్రతి ఖర్చుకు లెక్కలన్నీ కేంద్రం వద్దే ఉంటాయి. అమిత్ షా వాటిని చూసి మాట్లాడాలి’ అని అన్నారు.చంద్రబాబు, రామోజీ భూ దందా బయటపడుతుందనే!‘ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించి, భద్రత చేకూర్చేందుకు కేంద్రమే ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారం అమిత్‌షాకు ఎందుకు కనిపించట్లేదు? చంద్రబాబు, రామోజీరావు భూదందాలు బయటపడతాయనే భయంతోనే వారిద్దరూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో బురద జల్లుతున్నారు.గతంలోనే ఈనాడు అన్నదాతలో ఈ చట్టాన్ని గొప్పగా కీర్తించి (ఈనాడు ప్రసారం చేసిన వీడియోలను ప్రదర్శించారు), ఇప్పుడు భూములు దోచేస్తారంటూ ప్రచారం చేస్తోంది. ఇలా వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడం పెద్ద నేరం. రెండు నాల్కల ధోరణి బయటపడటంతో రామోజీరావు పాత వీడియో లింక్‌లను యూట్యూబ్ నుంచి తొలగించారు. భూముల అక్రమాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే రామోజీ వంటి నేరగాళ్లు ఎంతో మంది బయటకొస్తారు’ అని తెలిపారు. -
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న దొంగ నాటకాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారు. అసెంబ్లీలో 2019 జూలై 29న ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగం వీడియోను ఆయన ఆదివారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని, ఎవరి భూములపై వారికి భద్రత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కార్ భూమి పేరుతో అమలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆనాడు అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు.ఈ చట్టం 1858 నుంచి ఆస్డ్రేలియా దేశంలో అమలవుతోందని, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉందని కేశవ్ చెప్పారన్నారు. ఆనాడు బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి, ఆమోదించిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ, రద్దు చేస్తామని చెబుతూ ఆయన నగ్న స్వరూపాన్నీ ఆయనే బయటపెట్టుకున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని చెప్పారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు, భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంటే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు.దీనిపై ప్రజాకోర్టు బోనులో నిలబడి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు స్వార్ధ ప్రయోజనాల కోసం 5 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఇంతకంటే నీచులు.. రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా అంటూ తూర్పారబట్టారు. సీఎం జగన్‌ను ఎత్తి చూపేందుకు ఏ అస్త్రాలూ లేకపోవడంతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కుట్రతో చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబేనని, దీనిని ఆయనే మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశమంతా బీజేపీ ఒకలా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ రాష్ట్ర విభాగం పనిచేస్తోందని అన్నారు. పురందేశ్వరి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్ షాకు తెలుసు. కూటమిలో పార్ట్నర్ కాబట్టే అమిత్ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్‌కు ఉంది. పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది? -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన మనుషులు ఇన్నాళ్లూ సాగించిన భూ కుంభకోణాలు, కబ్జాలు బయటపడతాయని, ఆ భయంతోనే ఆయన, ఎల్లో మీడియా ఈ చట్టంపై దష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జల శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధ్యేయమని పునరుద్ఘాటించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు తెలిపారు. భూ పరిపాలనలో గొప్ప సంస్కరణగా నిలిచే, విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ చట్టంపై పచ్చ మీడియా సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు భద్రంగా కడితే దొంగలకు భయమేననని, భూ కుంభకోణాలకు, కబ్జాలకు మారుపేరైన చంద్రబాబుకు ఈ చట్టం నచ్చదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అన్నారు. సీఎం జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగే కానీ, గ్రాబింగ్ కాదని చెప్పారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సమగ్ర భూ సర్వే జరిగిందని, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయి, ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చని తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారని, ఆ తర్వాతే విధి విధానాలు ఖరారవుతాయని, చట్టం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వా«దినేత భూములు మింగేస్తాకరని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భూ సంస్కరణలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులను జీర్ణించుకోలేకే చంద్రబాబు వీటికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రజలకు మేలు చేసేదిలా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదని చెప్పారు.ప్రధాని కూడా భూ కబ్జాలు చేస్తారని బాబు ఉద్దేశమా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చట్టమని, దానినే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమైతే నరేంద్ర మోదీ కూడా దేశంలో భూములు కబ్జా చేస్తున్నట్లు ఆయన ఉద్దేశమా అని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబును కచ్చితంగా శిక్షించాల్సిందేనని, బీజేపీ నేతలు ఆయనకు మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలని అన్నారు. వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరమని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టేనని తేల్చిచెప్పారు. ఈ చట్టంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీఐడీ విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తోంది కచ్చితంగా విష ప్రచారమేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. భూముల పత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులని నిలదీశారు. సీఎం జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని, బాబుకు నచ్చకపోతే ఇబ్బందేమీ లేదని చెప్పారు.భూకబ్జాలు చేసింది బాబు, టీడీపీనేరాష్ట్రంలో భూ కబ్జాలు చేసింది చంద్రబాబు, టీడీపీనే అని సజ్జల చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెబ్‌ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అమరావతి ప్రాంతంలో (సీఆర్డీఏలో) చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు దోచేశారని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు చేసిన భూకుంభకోణంపై విచారణ కూడా జరుగుతోందన్నారు. డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో భూములు లాక్కున్నారని తెలిపారు. 2014–19 మధ్యనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు. సాదా బైనామా పేరుతో పేపర్లు సృష్టించి భూములు కాజేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కట్టుకోవడానికి భూమిని లీజుకు తీసుకున్న రామోజీరావు.. ఆ భూమిలో రహదారి కోసం 600 గజాల భూమిని ఇచ్చి, దాని పరిహారాన్ని భూ యజమానికి ఇవ్వకుండా మింగేశారని చెప్పారు. ఇలాంటి కబ్జాకోరు రామోజీరావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ఫ్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement