-
అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్
Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్.. స్పానిష్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. తద్వారా అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. Classy words from the seven-time champion. An emotional Novak Djokovic speaks after his #Wimbledon final defeat to Carlos Alcaraz... pic.twitter.com/Lvg980Sbn8 — Wimbledon (@Wimbledon) July 16, 2023 కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్ 2023 ఫైనల్ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్కరాజ్ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్కరాజ్ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంటర్ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్కరాజ్.. సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్ గెలిచి గ్రాండ్‌స్లామ్ ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్.. తొలి సెట్ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. -
46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 12వసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు. ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ జొకోవిచ్ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు. జొకోవిచ్ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌లో ఎదురులేని ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లోనే ఫెదరర్ అత్యధికంగా 8 టైటిల్స్ గెలిచాడు. స్వతహాగా ఫెదరర్‌కు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అంతర్జాతీయ టెన్నిస్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌కు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. తాజాగా జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను పురస్కరించుకొని ప్రమోషనల్ భాగంగా మంగళవారం బాల్‌బాయ్స్, బాల్గర్ల్స్తో సరదాగా గడిపాడు. ఇదే సమయంలో బ్రిటన్ యువరాణి.. 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్'.. కేట్ మిడిల్టన్(Kate Middleton) వింబుల్డన్ కోర్టులోకి వచ్చింది. ఆమెను తనతో టెన్నిస్ ఆడేందుకు తొలుత ఫెదరర్ ఆహ్వానించాడు. దీంతో ఇద్దరు కలిసి కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలోనే యువరాణి ఓ పాయింట్ కూడా సంపాదించారు. బాల్ సరిగ్గా గీత మీద పడటంతో ఈ పాయింట్ రాగా.. ‘అమేజింగ్’ అంటూ ఫెదరర్ ప్రశంసించారు. కేట్ కొద్దిసేపు బాల్ గర్ల్‌గానూ వ్యవహరించారు. అయితే కేట్ మిడిల్టన్ నిబంధనలు మరవడంతో బాల్‌గర్ల్ ఆమెకు సలహా ఇచ్చింది. బంతి బౌన్స్ అయిన తర్వాతే మనం అందుకోవాలి అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే యువరాణి విజ్ఞప్తి మేరకు టెన్నిస్‌లో మెళకువలు నేర్పించాడు. ‘ఇది సరైన ప్రాక్టీస్. నేను ఇంప్రెస్ అయ్యాను’ అంటూ ఫెదరర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న కేట్.. వింబుల్డన్‌లోని రాయల్ బాక్స్‌లో తరచూ కనిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో..
Serena Williams Reveals Second Pregnancy: అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతోంది. తన చిన్నారి కూతురు ఒలింపియా కోరినట్లుగానే తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతోంది. మెట్ గాలా-2023 ఈవెంట్ వేదికగా తాను మరోసారి గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది సెరీనా. బేబీ బంప్ ప్రదర్శిస్తూ భర్త అలెక్సిస్ ఒహనియన్‌తో కలిసి సెరీనా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సందడి చేసింది. నల్లటి గౌన్‌కు తెలుపు రంగు స్కర్ట్ జతచేసిన ఈ అమెరికా నల్లకలువ.. ముత్యాల హారం ధరించి మెరిసిపోయింది. నిండైన అవుట్‌ఫిట్‌లో రెడ్‌కార్పెట్‌పై బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మేము ముగ్గురం ఇక సెరీనా భర్త బ్లాక్ కలర్ టక్సిడో ధరించి ఆమెను మ్యాచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది సెరీనా. ‘‘మా ముగ్గురికీ మెట్ గాలాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించాం’’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. చాంపియన్‌గా సత్తా చాటి కాగా అమెరికాకు చెందిన సెరీనా.. టెన్నిస్ స్టార్‌గా వెలుగొందింది. 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆమె.. ఏకంగా 23 సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో రెండు నెలల గర్భంతో ఉన్న సెరీనా చాంపియన్‌గా నిలిచింది. కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఆమె.. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చినా గాయం కారణంగా 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైంది. ఈ క్రమంలో గతేడాది ఆగష్టు 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఆమె.. తాను రిటైర్ అవ్వలేదంటూ అక్టోబరులో సంకేతాలు ఇచ్చింది. కానీ మళ్లీ ఇంతవరకు కోర్టులో దిగలేదు. రోజర్ ఫెదరర్ సైతం ఇక ఇప్పుడు తన కుటుంబం పెద్దది కాబోతోందంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం ఈ ఈవెంట్లో సందడి చేయడం విశేషం. చదవండి: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్ IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..! View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) -
శుభ్‌మన్ గిల్‌ను ఫెదరర్‌తో పోల్చిన పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా యంగ్ డైనమైట్, రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రోగ్రాం సందర్భంగా భట్ మాట్లాడుతూ.. గిల్‌తో పాటు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేర్లను ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్ చేసిన విధ్వంసకర శతకాన్ని కొనియాడిన భట్.. ఇదే సందర్భంగా గిల్ సహచరుడు, సహ ఓపెనర్ ఇషాన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. గిల్ బ్యాటింగ్ స్టయిల్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇషాన్ స్థాయి ఇంకా మెరుగుపడాలని సూచించాడు. ఇషాన్‌తో పోలిస్తే గిల్ స్థాయి చాలా ఎక్కువ అని, ఈ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా తాను ఈ కామెంట్ చేయట్లేదని అన్నాడు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే టెన్నిస్‌లో ఫెదరర్ ఆట చూసిన ఫీలింగ్ కలుగుతుందని, ఫెదరర్లా గిల్ కూడా ఆటను చాలా క్లాస్‌గా ఆడతాడని ప్రశంసించాడు. పవర్ హిట్టింగ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో గిల్ కష్టపకుండా, టెక్నిక్ ఉపయోగించి సునాయాసంగా షాట్లు ఆడుతున్నాడని కొనియాడాడు. గిల్ ఆడిన ప్రతి షాట్ కూడా అచ్చమైన క్రికెటింగ్ షాట్ అని, టెన్నిస్‌లో ఇదే ఫార్ములా ఫాలో అయిన ఫెదరర్ ఎలా సక్సెస్ అయ్యాడో గిల్ కూడా అలాగే సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. టెక్నిక్ విషయంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో గిల్ మించిన బ్యాటర్ లేడని, ఇతను కచ్చితంగా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని ప్రశంసల వర్షం కురింపించాడు. పాక్ మాజీలు సహజంగా టీమిండియా ఆటగాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కానీ, భట్ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 నాటౌట్ పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్.. అంతకుముందు కివీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement