-
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్‌లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
తీర ప్రాంత శోధన కోసం ఎన్‌సీసీఆర్ కేంద్రం
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్‌సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్‌కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు. ఇప్పటివరకూ ఎన్‌సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement