-
ఫేక్ న్యూస్‌పై రీసెర్చ్ : రూ.34 లక్షలు పొందండి
న్యూఢిల్లీ : నకిలీ వార్తల విషయంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. "బాధ్యతారహితమైన, తీవ్ర సందేశాలు" విస్తరించకుండా నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వాట్సాప్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాట్సాప్ వెంటనే చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంపై రీసెర్చ్ చేసేందుకు నిపుణులు కావాలని బుధవారం వాట్సాప్ ప్రకటించింది. వారికి భారీ బహుమానాన్ని కూడా అందించనున్నట్టు తెలిపింది. తమ యూజర్ల భద్రతకు ఎక్కువగా కృషిచేస్తామని, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం తాము భారత్‌లోని దిగ్గజ అకాడమిక్ నిపుణుల కోసం చూస్తున్నామని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా తప్పుడు సమాచారాన్ని విస్తరిస్తున్నాయో తెలుపాలని పేర్కొన్నారు. ఈ స్థానిక రీసెర్చ్‌లు నకిలీ వార్తలు, ఆందోళనకర అంశాలను గుర్తించడానికి ఉపయోగపడతారని చెప్పారు. స్వతంత్ర పరిశోధన ప్రతిపాదనకు వాట్సాప్ రీసెర్చ్ అవార్డులు నిధులను అందిస్తాయి. ఒక్కో పరిశోధన ప్రతిపాదనకు రూ.34 లక్షల వరకు బహుమానం అందజేయనున్నామని వాట్సాప్ తెలిపింది. ఎక్కడైతే వాట్సాప్ ప్రముఖ కమ్యూనికేషన్ సాధనంగా ఉందో అంటే భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాల్లో నిర్వహించిన పరిశోధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొంది. దీనికోసం వాట్సాప్ దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. పీహెచ్డీ పొందిన రీసెర్చర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే వాట్సాప్ అంగీకరిస్తుందని, కొన్ని కేసుల్లో పీహెచ్డీ లేకపోయినా.. టెక్నాలాజికల్ రీసెర్చ్ లేదా సోషల్ సైన్సెస్‌లో ఎక్కువ విజయాలు సాధించిన వారికి దరఖాస్తులను కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. దరఖాస్తులకు చివరి తేదీ 2018 ఆగస్టు 12గా వాట్సాప్ ప్రకటించింది. సెప్టెంబర్ 14కు దరఖాస్తు స్టేటస్‌ను రీసెర్చ్లకు వాట్సాప్ నోటిఫై చేయనుంది. మరిన్ని వివరాల కోసం వాట్సాప్ బ్లాగ్‌ను సందర్శించాల్సిందిగా పేర్కొంది. -
హైదరాబాదీకి 3 కోట్ల పరిశోధక అవార్డు!
న్యూయార్క్: అమెరికాలో ఓ హైదరాబాద్ ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పరిశోధక అవార్డు లభించింది. న్యూయార్క్ యూనివర్సిటీ, స్నెర్ట్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అయిన శ్రీకాంత్ జగబత్తులకు ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ అవార్డు(కెరీర్)’ను సైన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. అవార్డు కింద శ్రీకాంత్‌కు ఐదేళ్ల కాలంలో మొత్తం 5 లక్షల డాలర్ల(రూ. 3.10 కోట్లు) నిధులుఅందుతాయి. వాణిజ్యరంగంలో ఉపయోగపడే సమాచార సాంకేతిక(ఐటీ) సంబంధమైన ‘డాటా-డ్రివెన్ మాడలింగ్ అండ్ లర్నింగ్ టెక్నిక్స్’ అంశంలో పరిశోధనల కోసం ఈ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. ఆయన రూపొందించనున్న సులభమైన టెక్నిక్లద్వారా.. వ్యాపార రంగంలో సరైన ఉత్పత్తులను డిజైన్ చేయడం, ప్రతి ఉత్పత్తి ఎంత పరిమాణం, ఎంత ధరతో ఉండాలన్నది నిర్ణయించడం వంటివి సులభం కానున్నాయి. వ్యాపారంలో ఇలాంటి పద్ధతులు ఉన్నప్పటికీ శ్రీకాంత్ వాటికి భిన్నమైనఅప్లికేషన్లను రూపొందిస్తారు. వ్యాపార నిర్వహణకు సంబంధించిన కంప్యూటర్ సమాచారం(కొనుగోళ్లు, మార్కెటింగ్అధ్యయనాలు, ఇన్సూరెన్స్ పాలసీలు) ఆధారంగా కొత్తపద్ధతులను అమలుచేసేందుకు శ్రీకాంత్ పరిశోధనలతో వీలవుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement