-
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్‌తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్‌ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
-
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ లేటుగా మేల్కొంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాక వరుస విజయాలు సాధిస్తుంది. సీజన్లో తమ తొలి మ్యాచ్, నాలుగో మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఇప్పుడు వరుసగా తొమ్మిది, పది మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్వైపు ఆశగా చూస్తుంది.ప్రస్తుతం పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. నిన్న (మే 1) సీఎస్కేపై గెలుపు పంజాబ్‌లో కొత్త జోష్ నింపింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సీఎస్కేను 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు.పంజాబ్ ఈ సీజన్లో మరో నాలుగు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండగా.. అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా జట్లు కూడా మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ప్లే ఆఫ్స్ బెర్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.పంజాబ్ ఖాతాలో ఘనమైన రికార్డు..నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్ ఓ అరుదైన ఘనత సాధించింది. ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్లో సీఎస్కేను వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పంజాబ్‌కు సీఎస్కే హోం గ్రౌండ్ అయిన చెపాక్‌లో ఇది నాలుగో విజయం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (5) మాత్రమే సీఎస్కేను వారి సొంత మైదానంలో ఇన్ని మ్యాచ్‌ల్లో ఓడించింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ (62) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవ్వరూ రానించలేదు. రహానే 29, సమీర్ రిజ్వి 21, మొయిన్ అలీ 15, ధోని 14 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు రాహుల్ చాహర్ (4-0-16-2), హర్‌ప్రీత్ బ్రార్ (4-0-17-2), రబాడ (4-0-23-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. ఆడుడూపాడుతూ 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జానీ బెయిర్‌స్టో (46), రిలీ రొస్సో (43), శశాంక్ సింగ్ (25 నాటౌట్), సామ్ కర్రన్ (26 నాటౌట్) పంజాబ్‌ను గెలిపించారు. -
‘కింగ్స్’ పోరులో పంజాబ్‌దే గెలుపు
చెన్నై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించింది. గత శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్లతో గెలిచింది. పంజాబ్ కింగ్స్ కెపె్టన్ స్యామ్ కరన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించాడు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్ (2/17), రాహుల్ చహర్ (2/16) చెన్నై జట్టును కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్‌స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), రిలీ రోసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక శశాంక్ సింగ్ (26 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), స్యామ్ కరన్ (20 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. గత మూడు సీజన్లలో చెన్నైపై పంజాబ్ కింగ్స్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 2022లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్ 2023లో చెన్నైలోనే జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలిచింది. కట్టడి చేసిన బ్రార్, చహర్ చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిశాక చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బ్రార్ మూడు బంతుల తేడాలో రహానే, శివమ్ దూబే (0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత పదో ఓవర్లో జడేజాను చహర్ అవుట్ చేశాడు. దాంతో చెన్నై జట్టు 64/0 నుంచి 70/3తో కష్టాల్లో పడింది. బ్రార్, చహర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టు బ్యాటర్లు వరుసగా ఎనిమిది ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. రబడ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి రిజ్వీ బౌండరీ కొట్టి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతిని బౌండరీ దాటించిన రుతురాజ్, మూడో బంతికి సిక్స్ కొట్టి 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ చివరి బంతిని రుతురాజ్ సిక్స్‌గా మలచడంతో ఈ ఓవర్లో చెన్నైకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన అర్‡్షదీప్ లయ తప్పి మూడు వైడ్లు వేసినా రుతురాజ్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అర్‡్షదీప్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనూ రెండు వైడ్లతో కలిపి ఎనిమిది బంతులు వేశాడు. ఈ ఓవర్లో ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి చివరి బంతికి రనౌట్ అయ్యాడు. పంజాబ్ స్పిన్నర్లు బ్రార్, చహర్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (సి) రోసో (బి) హర్‌ప్రీత్ బ్రార్ 29; రుతురాజ్ గైక్వాడ్ (బి) అర్‡్షదీప్ సింగ్ 62; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ బ్రార్ 0; రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్ చహర్ 2; సమీర్ రిజ్వీ (సి) హర్షల్ పటేల్ (బి) రబడ 21; మొయిన్ అలీ (బి) రాహుల్ చహర్ 15; ధోని (రనౌట్) 14; డరైల్ మిచెల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–70, 4–107, 5–145, 6–147, 7–162. బౌలింగ్: రబడ 4–0–23–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–52–1, స్యామ్ కరన్ 3–0–37–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–17–2, రాహుల్ చహర్ 4–0–16–2, హర్షల్ పటేల్ 1–0–12–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) రుతురాజ్ (బి) గ్లీసన్ 13; బెయిర్‌స్టో (సి) ధోని (బి) దూబే 46; రిలీ రోసో (బి) శార్దుల్ 43; శశాంక్ సింగ్ (నాటౌట్) 25; స్యామ్ కరన్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1–19, 2–83, 3–113. బౌలింగ్: దీపక్ చహర్ 0.2–0–4–0, శార్దుల్ ఠాకూర్ 3.4–0–48–1, గ్లీసన్ 3.5–0–30–1, ముస్తఫిజుర్ 4–1–22–0, జడేజా 3–0–22–0, మొయిన్ అలీ 2–0–22–0, శివమ్ దూబే 1–0–14–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్‌వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement