-
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.ఎనిమిది దేశాలకు చెందిన 27మంది వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు. -
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్‌లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్‌ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్‌లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్‌కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement