-
అజిత్‌కి జోడీగా...
కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
చెన్నైకి గేమ్
చెన్నైలో ఆట మొదలెట్టనున్నారు హీరో రామ్‌చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ చెన్నైలోప్రారంభం కానుందని సమాచారం. మే మొదటి వారంలో చెన్నైలోప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్ చంద్రలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
‘‘బాక్’ మూవీ ట్రైలర్ చూస్తే సుందర్‌గారు ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తుంది. షూటింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అని హీరోయిన్ తమన్నా అన్నారు. సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్మనై 4’. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అవ్ని సినిమాక్స్పై ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో మే 3న రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో నా సినిమా జర్నీ సురేష్ ప్రోడక్షన్ నుంచే మొదలైంది. ‘బాక్’ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్‌గారికి, జాన్వీకి థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్‌లో అదరగొడుతుంది’’ అన్నారు. ‘‘బాక్’లో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు రాశీ ఖన్నా. ‘‘ఈ మూవీని థియేటర్స్‌లో చూడండి.. ఎంజాయ్ చేస్తారు ’’అన్నారు జాన్వీ నారంగ్. ‘‘చాలా కాలం తర్వాత ‘బాక్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ’’ అన్నారు కోవై సరళ. -
ప్రభాస్ కల్కి.. ఆ పోస్టర్ కూడా కాపీనేనా?
యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్‌లో డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.అయితే తాజా పోస్టర్ చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ మూవీ డూన్‌ను పోలి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ సినిమా నుంచే కాపీ కొట్టారా? సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పోస్టర్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ పోస్టర్లో ఇసుక కనిపిస్తున్న కారణంగా అలా పోల్చడం సరైంది కాదని అన్నారు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించొద్దని ఆయన సూచించారు.కాగా.. కల్కి 2898 ఏడీ మహాభారతంతో ముడిపడి ఉంటుందని గతంలోనే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని తెలిపారు. గతంలోనూ కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ సైతం హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయంటూ విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement