-
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు. -
IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా జస్ప్రీత్ బుమ్రా..?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది. నెట్స్‌లో గంటల కొద్దీ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ఎక్స్‌లో షేర్ చేసింది. బుమ్రా రివర్స్ స్వీప్, పుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నటు ఈ వీడియోలో కన్పించింది. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో బుమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో.. బుమ్రాతో ఓపెనింగ్ చేయంచాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. Aaj batting tera Jassi bhai karega! 😎💥#MumbaiMeriJaan #MumbaiIndians | @Jaspritbumrah93 pic.twitter.com/RO0WWHh7Fz— Mumbai Indians (@mipaltan) April 26, 2024 -
ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి.. టాప్‌లో కోహ్లి, బుమ్రా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సగానికి పైగా మ్యాచ్‌లు (38 మ్యాచ్‌లు) పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ బెర్తులపై పూర్తి క్లారిటీ రానప్పటికీ ఓ అంచనా అయితే వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సన్‌రైజర్స్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో సూపర్ జెయింట్స్ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఈ ఐదు జట్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టుకు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఆరు, ముంబై (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడు, ఢిల్లీ (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. 8 మ్యాచ్‌ల్లో రెండిట గెలిచిన పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో పాతుకుపోయింది. ప్రస్తుత సీజన్లో 70 మ్యాచ్‌లు (క్వాలిఫయర్స్, ఎలిమినేట్, ఫైనల్స్ కాకుండా) జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వ్యక్తిగత విభాగాల్లో (అత్యధిక పరుగులు, వికెట్లు) విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నారు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 63.17 సగటున 150.40 స్ట్రయిక్‌రేట్‌తో 379 పరుగులు చేయగా.. బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి చహల్, హర్షల్ పటేల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు.. అత్యధిక పరుగులు-విరాట్ కోహ్లి (379) అత్యధిక వ్యక్తిగత స్కోర్-విరాట్ కోహ్లి (113) అత్యధిక సగటు-రవీంద్ర జడేజా (141) అత్యధిక స్ట్రయిక్‌రేట్-రొమారియో షెపర్డ్ (280.00) అత్యధిక శతకాలు-బట్లర్ (2) అత్యధిక హాఫ్ సెంచరీలు-రియాన్ పరాగ్, శాంసన్, క్లాసెన్, డికాక్ (3) అత్యధిక బౌండరీలు-ట్రవిస్ హెడ్ (39) అత్యధిక సిక్సర్లు- క్లాసెన్ (26) బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్, హర్షల్) ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక బౌలింగ్ సగటు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ (9.0) పేరిట ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు-సందీప్ శర్మ (5/18) (బుమ్రా,యశ్ ఠాకూర్, సందీప్ శర్మ.. ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు) అత్యుత్తమ సగటు-మయాంక్ యాదవ్ (6.00) -
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
PBKS Vs MI: బుమ్ బుమ్ బుమ్రా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ రిలే రూసోను అద్బుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి రూసో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి సామ్ కుర్రాన్.. రూసోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రూసోకు బుమ్రా అద్బుతమైన యార్కర్ వేశాడు. రూసో తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇది చూసిన రూసోకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. Simply unplayable Bumrah 🫡🔥#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinHindi | @mipaltan | @Jaspritbumrah93 pic.twitter.com/fGmNlFNIqZ — JioCinema (@JioCinema) April 18, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement