-
Janhvi Kapoor Photos: షార్ట్ డ్రస్‌లో జాన్వీ కపూర్.. చూస్తే మతి పోతుందంతే! (ఫొటోలు)
-
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్‌కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ చూశారా!
దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్‌లోకి అడుగు పెట్టింది. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్లో అడుగు పెట్టింది. కాగా.. టాలీవుడ్లో కొరటాల డైరెక్షన్లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లోనూ కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. -
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్‌లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్‌రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement