-
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్ హీరోలా లుక్ మెయింటెయిన్ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్ చేయడం కుదరదు. అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్ తర్వాత షర్ట్ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. బ్రిటిష్-పాకిస్తానీ నటుడు అలీఖాన్ జాన్ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్నెస్ సీక్రెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్నెస్ సీక్రెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్. ఇక జాన్ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జాన్. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్ మెయిటెయిన్ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్. వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్ డ్రింక్స్ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్. అంతేగాదు సిగరెట్ కంటే పాయిజన్ చక్కెరే అని జాన్ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్ కదూ..!(చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్) -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్‌స్టా పోస్ట్‌తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్‌లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్‌లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్‌గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్‌ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్‌కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
మనుషులు ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా వయసును దాచడం సాద్యం కాదు. వయసు రీత్యా వచ్చే మార్పులను కూడా ఆపలేం. కానీ ఇక్కడొక వ్యక్తి తాతా వయసులో ముప్పై ఏళ్ల కుర్రాడిలా అదిరిపోయే ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతడి ఆరోగ్య రహస్యం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఇలా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారా..? అనుకుంటారు. వివరాల్లోకివెళ్తే..యూఎస్‌లోని మిచిగాన్కు చెందిన 61 ఏళ్ల డేవ్ పాస్కో 38 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరోగ్య, దీర్ఘాయువు కోసం కఠిన జీవన శైలిని అనుసరించేవాడు దేవ్ . తనని తాను బయోహ్యాకర్గా అభివర్ణించుకుంటాడు. ఆహారం, వ్యాయామం పట్ల కనబర్చిన శ్రద్దే జీవసంబందమైన వయస్సును 38 ఏళ్లకు మార్చిందని దేవ్ చెబుతున్నారు. అంతేగాదు తన రోజువారి దినచర్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను సూర్యోదయానికి ముందే లేచి ఆరుబయట గడపటం, వ్యాయమాలు చేయడం వంటివి చేస్తానని తెలిపారు. అలాగే నిర్థిష్ట ఆహార నియమాలను పాటిస్తానని, ప్రతిరోజూ దాదాపు 158 సప్లిమెంట్లను తీసుకుంటానని అన్నారు. తన లక్ష్యం కేవలం తన వయసు తక్కువగా చూపించేలా ఉండటం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటమేనని తెలిపారు. అంతేగాదు తనకు 90 లేదా 110 ఏళ్లు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా జీవించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు దేవ్. ఎన్నీ అర్జెంట్ పనులు, అవాంతరాలు వచ్చినా.. తన రోజువారి దినచర్య పూర్తి అయ్యిన తర్వాతే ఏదైనా చేస్తానని తేల్చి చెప్పారు. తన విలువై సమయాన్ని ఇతరులతో గడిపేందుకు ఇవ్వనని, ఒంటిరిగానే ఉంటానని అంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడూ తనతో తాను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడట దేవ్. మిగతా సమయం అంతా వ్యాయామాలు, ఆవిరి సెషన్లతో గడిచిపోతుందట. అలాగే అతడు చాలా అరుదుగా భోజనం చేస్తాడట. అంతేగాదు సేంద్రియ గడ్డి తినే గొడ్డు మాంసం, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా చేపలు డిన్నర్లో తీసుకుంటాడట. ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు, వెల్లుల్లి, తప్పకుండా ఉండేలా చూసుకుంటాడట. అయితే ఇక్కడ దేవ్ బరువు పెరగకపోవడానికి కారణం.. కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడమేనని చెబుతున్నాడు. ఇక్కడ దేవ్ బయోహ్యాకింగ్ పద్ధతుల్లో సక్రమైన జీవనశైలితో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసి కుర్రాడిలా ఫిట్నెస్గా మారాడు. ఇటీవలకాలంలో ఈ బయోహ్యాకింగ్ ఉద్యమం ఒక ట్రెండ్‌గా మారింది. అంటే ఆరోగ్యంగా ఉండేలా వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వివిద పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు మాత్రం దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని, పైగా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్‌బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement