-
గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆసంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగిరెడ్డి, చెన్నాకొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం,చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధకారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు,పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహ కోరుకునే యువతియువకుల కోసం మాట్రిమోనీ మొదలయిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. గ్రేటర్ రాయలసీ సంస్కృతిని కాపాడటం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవేకాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు వైద్య నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. డల్లాస్ నగరంలో రాలయసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజురోజుకి సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డల్లాస్ వాసలు, డల్లాస్‌కి వచ్చేవారు గ్రాడా(GRADA) సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఫిబ్రవరి 17న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్(North Texas Food Bank) వారి ద్వారా దాదాపు 500 మందికి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచి పెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డల్లాస్ వాసుల కోసం GRADA నిర్వర్తించనుంది. ఈ కార్యక్రమంలో నందకొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమామహేశ్వర్ గర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణి కుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల,భానుమితి రేవుల, సునీల జంపాల, హర్షదళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్కుంట, హరినాత్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవని మెట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. (చదవండి: అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..) -
నాట్స్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ పోటీలకు విశేష స్పందన
భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్.. తెలుగు వేడుకలకు సిధ్దమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన 'బ్యాడ్మింటన్ మరియు పికిల్‌బాల్' టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్‌లోని లెవిస్విల్లేలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్లేయర్స్ పెద్ద ఎత్తున పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు. ఒపెన్ మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఒపెన్ ఉమెన్స్ డబుల్స్, సినీయర్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో పికిల్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఆసక్తిగా సాగాయి. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 15,16 తేదీల్లో జరిగే నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలను అందించనున్నారు. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
డల్లాస్ లో యాత్ర 2 మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్
-
డల్లాస్ లో గ్రాండ్ గా యాత్ర 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement