-
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలని కోరితే.. నా ఆన్సర్ ఇదే అన్నందుకు ట్రోలింగ్! (ఫొటోలు)
-
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1తో పాక్‌పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్‌డౌన్ బ్యాటర్ ఫాక్స్‌క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్‌వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్‌లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పునర్నియమితుడయ్యాడు.ఇక బాబర్ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! ఈ విషయమై పాకిస్తాన్‌కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్ ఫ్యాన్స్ దెబ్బకు ఆమె అకౌంట్‌ను కాసేపు ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్ జహంగీర్ అనే బుల్లితెర నటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేసిందన్న వార్త వైరల్ అయింది.అంతేకాదు.. ‘‘బాబర్ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్‌స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.ఈ క్రమంలో బాబర్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్ తన అకౌంట్‌ను సోమవారం కాసేపు ప్రైవేట్‌గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్‌ను పబ్లిక్ చేసేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 వైఫల్యం తర్వాత బాబర్ ఆజం పాక్ కెప్టెన్‌గా వైదొలిగాడు.దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. షాన్ మసూద్‌ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. ఇక మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్‌తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement