-
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
AP High Court: ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కాగా, వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఈ ప్రమాణ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బడుగుల భూచోరుడు చంద్రబాబే..
రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్‌్జషీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలింది. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్ (రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్ భూములకు సీఆర్డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు ► అసైన్డ్ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. ► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. ► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు. ► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement