-
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
డింపుల్ కపాడియా… బాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా 1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్ హిట్ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది. తన భర్త కోరిక మేరకు సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్ సినిమా 'టెనెట్'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది. -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
జాలీ రైడ్
బాలీవుడ్ హిట్ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ‘‘ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్‌గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా షూటింగ్లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్‌కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement