-
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా అరెస్ట్
-
గ్లామర్ సీక్రెట్ ఏంటి?
-
వ్యభిచార కేసులో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
-
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్ అఖిల్ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement