ఐసీఐసీఐ లాంబార్డ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ | ICICI Lombard launches 'road side assistance cover' | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లాంబార్డ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్

Sep 22 2013 1:54 AM | Updated on Aug 30 2018 5:38 PM

వాహనం కదలని పరిస్థితి లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఆదుకునేలా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను అందిస్తున్నామని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది.launches ''

వాహనం కదలని పరిస్థితి లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఆదుకునేలా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను అందిస్తున్నామని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది.  రూ.99 నుంచి ఈ యాడ్-ఆన్  బీమా పాలసీ ప్రారంభమవుతుంది. బీమా వాహనం కదలలేని పరిస్థితుల్లో  బీమా చేసిన వ్యక్తికి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించడం, వసతి సౌకర్యం, వాహనం యాంత్రిక లోపాలకు సంబంధించి ఫోన్‌లో తగిన సూచనలు ఇవ్వ డం, వాహనం ఆగిపోయిన ప్రదేశంలో తగిన సహాయం చేయడం,  బీమా చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం తదితర సేవలను సంస్థ అందిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement