తాగేసి.. పోలీసును చితకబాదేశాడు! | Drunk Rickshaw-Puller Beats Up Cop in Delhi | Sakshi
Sakshi News home page

తాగేసి.. పోలీసును చితకబాదేశాడు!

Oct 1 2015 8:42 AM | Updated on Sep 3 2017 10:18 AM

అతడో రిక్షా కార్మికుడు. బాగా మద్యం తాగే అలవాటుంది. అలాగే తాగేసి, ట్రాఫిక్ పోలీసును చితకబాదేశాడు.

అతడో రిక్షా కార్మికుడు. అతడికి బాగా మద్యం తాగే అలవాటుంది. తూర్పు ఢిల్లీ నడి వీధుల్లో అలాగే పూటుగా మద్యం తాగి వెళ్తూ.. మహిళలను దుర్భాషలాడుతుండగా ఓ ట్రాఫిక్ పోలీసు అతడిని చూశాడు. ఆపేందుకు ప్రయత్నించాడు.. అంతే, రిక్షా కార్మికుడికి ఎక్కడలేని కోపం వచ్చింది.

గతంలో తనను ట్రాఫిక్ పోలీసులు ఆపి వేధించిన విషయాలు ఏవైనా గుర్తుకొచ్చాయో ఏమో గానీ, ఇప్పుడు తనను ఆపిన కానిస్టేబుల్ను పట్టుకుని చితక బాదేశాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మధువిహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి రిక్షా కార్మికుడిని అరెస్టు చేశారు. అయితే, తన పేరు చెప్పే పరిస్థితిలో గానీ, వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో గానీ అతగాడు లేడట!

Advertisement
 
Advertisement
Advertisement