మహిళలకూ వయాగ్రా!! | all new Viagra pill for women | Sakshi
Sakshi News home page

మహిళలకూ వయాగ్రా!!

Jan 13 2014 1:53 PM | Updated on Sep 2 2017 2:36 AM

మగవారికే కాదు.. మగువలకు కూడా ఓ వయాగ్రా పిల్ తయారుచేశారు శాస్త్రవేత్తలు. అది కేవలం వారి శృంగార వాంఛలను పెంచడమే కాదు, బరువు కూడా తగ్గిస్తుందట.

మగవారికే కాదు.. మగువలకు కూడా ఓ వయాగ్రా పిల్ తయారుచేశారు శాస్త్రవేత్తలు. అది కేవలం వారి శృంగార వాంఛలను పెంచడమే కాదు, బరువు కూడా తగ్గిస్తుందట. అయితే ప్రస్తుతం ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న ఈ మాత్ర వచ్చే సంవత్సరాంతం నాటికి మార్కెట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది మహిళలు తమకు శృంగార జీవితం మీద అనురక్తి తగ్గుతోందని చెబుతున్నారు. అలాంటి వారికి కూడా ఉపయోగపడేలా, గతంలో వయాగ్రా టాబ్లెట్ను రూపొందించిన శాస్త్రవేత్తలే ఇప్పుడు మగువల వయాగ్రాపైనా పరిశోధనలు చేస్తున్నారు.

అయితే.. ఇది మాత్రం కొంత ఖరీదు ఎక్కువే ఉండబోతోంది. ఒక్కో టాబ్లెట్ సుమారుగా 1200 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మగవారి కోసం రూపొందించిన వయాగ్రా అమ్మకాలు ఏడాదికి దాదాపు 15 వేల కోట్ల రూపాయల మేర ఉన్నాయి. అందుకే ఆడాళ్ల వయాగ్రాను కూడా రూపొందించాలని చాలా ఔషధ కంపెనీలు ప్రయత్నించాయి గానీ, వయాగ్రా రూపొందించిన 'ఆర్లిబిడ్' అనే బ్రిటిష్ సంస్థకే అది సాధ్యమైంది. శృంగార వాంఛలను పెంచేందుకు మెదడు మీద పనిచేసే ఈ మందు ఉపయోగిస్తే, శరీర బరువు కూడా కొంతవరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement