గ్రేటర్గా వరంగల్! | Warangal set to become greater | Sakshi
Sakshi News home page

గ్రేటర్గా వరంగల్!

Jan 28 2015 4:05 PM | Updated on Aug 30 2019 8:24 PM

వరంగల్, కాజీపేట, హన్మకొండలను కలుపుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటవుతోంది.

హైదరాబాద్: వరంగల్ కార్పొరేషన్ హోదా పెరుగుతోంది. వరంగల్, కాజీపేట, హన్మకొండలను కలుపుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం తెలిపారు.

చారిత్రక, పర్యాటక పరంగా వరంగల్కు ఉన్న ప్రత్యేకతను మరింతగా పెంచుతామని మంత్రి చెప్పారు. పారిశ్రామిక, విద్యారంగాల్లో వరంగల్ను రాజధానికి దీటుగా తీర్చిదిద్దుతామని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హోదా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement