10లోపు పత్తి రైతులందరికీ గుర్తింపు కార్డులు | TS Govt empowers cotton farmers with ID cards | Sakshi
Sakshi News home page

10లోపు పత్తి రైతులందరికీ గుర్తింపు కార్డులు

Oct 3 2015 5:17 PM | Updated on Sep 3 2017 10:23 AM

తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం శనివారం జరిగింది. పత్తి రైతుల సమస్యలపై చర్చ ఈ సమావేశంలో చర్చించారు.

హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం శనివారం జరిగింది. పత్తి రైతుల సమస్యలపై చర్చ ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ పత్తి రైతులందరికీ గుర్తింపుకార్డుల జారీ చేయాలని నిర్ణయం జరిగింది.  అక్టోబర్ 10 నుంచి 17లోపు కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంతో పాటు, ఈ నెల 10లోపు పత్తి రైతులందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు.

 

కాగా ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి రైతుల వివరాలు, వారు సాగుచేసిన పంట వివరాలతో కూడిన కార్డును వారికి అందచేయనున్నారు. పత్తిసాగు చేపట్టిన రైతులకు ఇక నుంచి రెవెన్యూశాఖ, గుర్తించిన ఐడీ కార్డు జారీ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement