19న తెలంగాణ బంద్‌ | Telangana RTC Employess Action Plan | Sakshi
Sakshi News home page

19న తెలంగాణ బంద్‌

Oct 12 2019 4:25 PM | Updated on Oct 12 2019 5:50 PM

Telangana RTC Employess Action Plan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు పట్టు వీడటం లేదు.  తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్‌ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement