తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే | Telangana Budget 2019-20 Highlights | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

Sep 9 2019 1:45 PM | Updated on Sep 9 2019 1:45 PM

Telangana Budget 2019-20 Highlights - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2019–20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను రూ.1,46,492.3 కోట్ల అంచనాతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్‌) సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి రూ.1,13,099.92 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఆదాయ వ్యయం రూ.1,11,055.84 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లుగా చూపించారు. రెవెన్యూ మిగులు రూ.2,044.08 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా చూపించారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌)

బడ్జెట్‌ అంచనాలు

  • కేంద్ర పన్నులు, సుంకాల వచ్చే ఆదాయం రూ.19,718.57 కోట్లు
  • రాష్ట్రం విధించే పన్నుల ద్వారా వచ్చే రాబడి రూ.69,328.57 కోట్లు
  • పన్నులు కాకుండా వచ్చే ఆదాయం రూ.15,875.03 కోట్లు
  • గ్రాంటుల కింద వచ్చే నిధులు రూ. 8,177.75 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement