టీ ప్రభుత్వ ఉద్యోగులకు యూనిక్ కార్డులు | Tea unique cards for government employees | Sakshi
Sakshi News home page

టీ ప్రభుత్వ ఉద్యోగులకు యూనిక్ కార్డులు

Jan 3 2015 5:58 AM | Updated on Apr 7 2019 4:30 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూనిక్ (ప్రత్యేక) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూనిక్ (ప్రత్యేక) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఆర్థిక శాఖ ఇటీవల రూపొం దించిన సమీకృత ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్)లో భాగంగా వీటిని కేటాయించనున్నారు. దీని ఆధారంగా ఒక ఉద్యోగి సర్వీసులో చేరినప్పటి నుంచి రిటైరయ్యే వరకు పూర్తి వివరాలన్నీ ఎక్కడున్నా సీఎఫ్‌ఎంఎస్ ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వివరాలతోపాటు ప్రతి నెలా రిటైరయ్యే ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement