‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ | Superstar Krishna Suggests KCR Film City | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ

Aug 8 2014 4:38 AM | Updated on Aug 15 2018 9:22 PM

‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ - Sakshi

‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ

రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్: రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సినీ కేంద్రంగా హైదరాబాద్ మారబోతుందనడానికి ఇదొక శుభసూచకమని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ స్థాయిలో సినీ స్టూడియోలను నిర్మించే సత్తా కేసీఆర్‌కి ఉందనీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇతర దేశాల నుంచి కూడా సినిమా షూటింగులు చేసుకోవడానికి ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించనున్న సినిమా సిటీకి ‘కేసీఆర్ సినిమా సిటీ’ అని నామకరణం చేస్తే బావుంటుందని కృష్ణ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement