జాతీయ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి | proposals for untouchability national awards | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి

Oct 18 2014 1:34 AM | Updated on Sep 2 2017 3:00 PM

అస్పృశ్యత నివారణకు క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేస్తున్న వారితో పాటు షెడ్యూల్ కులాల వారిపై జరుగుతున్న నేరాలు, అకృత్యాలపై...

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ

సాక్షి, హైదరాబాద్: అస్పృశ్యత నివారణకు క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేస్తున్న వారితో పాటు షెడ్యూల్ కులాల వారిపై జరుగుతున్న నేరాలు, అకృత్యాలపై పోరాడుతున్న వ్యక్తులు, సంస్థల పేర్లను సూచిస్తూ జాతీయ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్రాన్ని కేంద్రం కోరింది.

ఈ అంశాలపై 2010-14 మధ్య కాలంలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థల వివరాలతో ఈ నెల 31లోగా సీఎం ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి రాష్ర్ట ప్రభుత్వానికి  శుక్రవారం లేఖ అందింది. అవార్డు నియమ నిబంధనలను తమ శాఖ వెబ్‌సైట్‌లో చూడవచ్చని లేఖలో కేంద్రం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement