సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం | nagam janardhan reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం

Dec 30 2014 3:01 AM | Updated on Sep 2 2017 6:55 PM

సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం

సీఎం గాలి మాటలు చెబుతున్నారు: నాగం

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆకాశహర్మ్యాలు, ఆకాశమార్గాలు అంటూ గాలిలో తిరుగుతూ గాలిమాటలు చెబుతున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన కరువు తో రైతులు, పాలన గాడితప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆకాశహర్మ్యాలు, ఆకాశమార్గాలు అంటూ గాలిలో తిరుగుతూ గాలిమాటలు చెబుతున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలతో ఇంధనం వృథా అవటం మినహా ప్రయోజనం లేదని, ఆయనను భూమ్మీదకు దింపాల్సిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement