ఇంటికి చేరిన ‘చెన్నై’ బాధితులు | home reached by chennai floods | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన ‘చెన్నై’ బాధితులు

Dec 6 2015 2:41 AM | Updated on Sep 3 2017 1:33 PM

ఇంటికి చేరిన ‘చెన్నై’ బాధితులు

ఇంటికి చేరిన ‘చెన్నై’ బాధితులు

చైన్నైలో వరద ప్రవాహంలో చిక్కుకుని నాలు గు రోజులుగా విలవిలలాడుతున్న మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన బాధితులు

ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
 నర్సింహులపేట :
చైన్నైలో వరద ప్రవాహంలో చిక్కుకుని నాలు గు రోజులుగా విలవిలలాడుతున్న మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన బాధితులు శనివారం తెల్లవారుజామున రెండు గం టల ప్రాంతంలో తమ ఇంటికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధి పనుల కోసం దాట్ల గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పదేళ్ల క్రితం చైన్నైకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాయి. అయితే చైన్నైలోని ఆర్‌కే నగర్, నెహ్రూనగర్‌లోని 10వ వీధిలో నివసిస్తున్న వారు నాలుగు రోజు లుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో శుక్రవారం వారు అక్క డి నుంచి ప్రైవేటు వాహనంలో ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధవులు ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement