నేడు ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు | Engineering seat allocation today | Sakshi
Sakshi News home page

నేడు ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు

Jun 8 2018 1:26 AM | Updated on Jun 8 2018 1:26 AM

Engineering seat allocation today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం విద్యార్థులకు సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఆ సమాచారాన్ని  ఠీఠీఠీ. ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థులకు ఎస్సెమ్మెస్‌ రూపంలో తెలియజేయనుంది.

ఈసారి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారందరికీ సీట్లను కేటాయించినా కన్వీనర్‌ కోటాలో మరో 6,898 సీట్లు మిగిలిపోనున్నాయి. మొత్తంగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో 96,703 మంది అర్హత సాధించినా ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 59,033 మంది పాల్గొన్నారు. అందులో 58,048 మంది విద్యార్థులు గతనెల 28 నుంచి ఈనెల 5 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలోని 70% సీట్లను (64,946), మిగతా 30% సీట్లను యాజమాన్య కోటాలో కాలేజీలు భర్తీ చేస్తాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement