తెలంగాణ ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్! | employees of telangana transco shocked! | Sakshi
Sakshi News home page

తెలంగాణ ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్!

Aug 29 2014 1:12 AM | Updated on Sep 2 2017 12:35 PM

టీ.ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్ తగిలింది. తెలంగాణ ఇంక్రిమెంట్ ఉత్తర్వులను సుప్తచేతనావస్థ (అబేయన్స్) లో పెడుతున్నట్టు టీ ట్రాన్స్‌కో గురువారం ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్: టీ.ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్ తగిలింది. తెలంగాణ ఇంక్రిమెంట్ ఉత్తర్వులను సుప్తచేతనావస్థ (అబేయన్స్) లో పెడుతున్నట్టు టీ ట్రాన్స్‌కో గురువారం ప్రకటించింది. ట్రాన్స్‌కో ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇంక్రిమెంట్‌ను ప్రకటిస్తూ ట్రాన్స్‌కో ఆఫీసు ఆర్డరు (టీవోవో)-12ను బుధవారం టీ ట్రాన్స్‌కో జారీచేసింది. అయితే, గురువారం దీనిని అబేయన్స్‌లో పెడుతున్నట్టు ప్రకటించింది. కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఇంధనశాఖ పరిధిలోని సింగరేణి ఉద్యోగులకు మాత్రం తెలంగాణ ఇంక్రిమెంట్‌ను గురువారం ప్రకటించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement