డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు | drug Inspectors cheks in fharmacys in nalgonda district | Sakshi
Sakshi News home page

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు

May 21 2016 3:40 PM | Updated on May 25 2018 2:38 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫార్మసీ షాపుల్లో శనివారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫార్మసీ షాపుల్లో శనివారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీఐలు రెండు బృందాలుగా విడిపోయి పట్టణ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలో సుమారు 180 వరకు ఔషధ దుకాణాలు ఉన్నాయి. కాగా, తమ తనిఖీల్లో భాగంగా కొన్ని షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్టు, ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేందిచనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement