వైరల్‌ వీడియో : ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనేమో! | Contractor Birthday Celebrations In Police Station In Karimnagar | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో : ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనేమో!

May 6 2019 12:44 PM | Updated on May 6 2019 12:55 PM

Contractor Birthday Celebrations In Police Station In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కాన్సెప్ట్‌ను కొందరు తమ ఇష్టానికి వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. సాధారణ ప్రజలకు కాకుండా బడా వ్యాపారవేత్తలకు, కాంట్రాక్టర్లకు, రాజకీయ వేత్తలకు మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్‌ పని చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనే దీనికి నిదర్శనం. ఓ కాంట్రాక్టర్‌ పుట్టినరోజు వేడుకులను పోలీస్‌ స్టేషన్‌లోనే దర్జాగా నిర్వహించారు. 

కరీంనగర్ లోని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టినరోజు ఇటీవల జరిగింది. దీంతో సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆయన పుట్టినరోజు వేడుకలను స్టేషన్ లోనే ఏర్పాటుచేశారు. కేక్ తెచ్చి కోసి ఆయనకు తినిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement