డిసెంబర్‌ నుంచి కానిస్టేబుల్‌ శిక్షణ  | Constable Training Will Start From December By TSPA | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ నుంచి కానిస్టేబుల్‌ శిక్షణ 

Nov 15 2019 3:48 AM | Updated on Nov 15 2019 3:48 AM

Constable Training Will Start From December By TSPA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా ఎన్నికైన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు డిసెంబర్‌ తొలి వారంలో శిక్షణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉమ్మడి 10 జిల్లాల్లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ (పీటీసీ)ల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 18,428 వేల పోస్టుల భర్తీలో భాగంగా ఎస్సై 1,272, కానిస్టేబుల్‌ 17,156 పోస్టుల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సైల శిక్షణ ప్రారంభమైంది. అయితే కానిస్టేబుళ్లందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వడం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)కి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరిలో కొందరిని ఆంధ్రప్రదేశ్‌లోని ట్రైనింగ్‌ కాలేజీలకు పంపాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఎంత మంది అభ్యర్థులని ఏపీకి పంపుతారన్న దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement