రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక | ready resign for AP special status, says butta renuka | Sakshi
Sakshi News home page

రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక

Oct 25 2016 12:08 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక - Sakshi

రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో జరుగుతున్న యువభేరిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు.

'ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో జగనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి సిద్దంగా ఉన్నాం. అవసరమైతే రాజీనామా వల్ల ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసిస్తే, మీ భవిష్యత్ కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ'ని బుట్టా రేణుక అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement