బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించాలనేది తన కలని బ్రిటిష్ నటి సమీరా మహ్మద్ అలీ తెలిపింది. త్వరలో విడుదల కానున్న ‘బీ పాజిటివ్’ సినిమాలో ఈ మోడల్ అమితాబ్‌తో నటిస్తోంది. ‘భారతీయ నటులందరిలోకి అమితాబ్ నా ఫేవరెట్. అద్భుతమైన నటుడు. దుబాయ్‌లో ఉన్న సమయంలో అవకాశమున్నంతవరకూ అమితాబ్ సినిమాలే చూస్తూ పెరిగా. నిజంగా అంత గొప్ప స్టార్ సరసన నటించడమంటే నిజంగా ఓ కలే’ అని అంది. 29 ఏళ్ల ఈ వయ్యారి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా గోవాలో ఉంది. ఈ సినిమాకు వె ంకటేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్, సమీరతోపాటు రాజ్ పురోహిత్, నివేదిత బిశ్వాస్ తదితరులు కూడా నటిస్తున్నారు.
ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో నటించడం ఇబ్బందికరంగా అనిపించడం లేదా అని ప్రశ్నించగా ఈ సినిమాని ఎంత బడ్జెట్‌తో తీస్తున్నారనేది విషయమే కాదంది. ఈ సినిమా కంటెంట్‌ను మాత్రమే తాను పరిగణనలోకి తీసుకున్నానంది. లండన్‌లో చిన్న బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తాయని పేర్కొంది. మూడు భాషల్లో తీస్తున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకర్షించిందంది. అయితే ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. స్టోరీలైన్ చెప్పగానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు ఎంతో ఆసక్తి కలిగించిందంది. అందువల్లనే ఈ సినిమా కోసం తన షెడ్యూల్‌ను మార్చేసుకున్నానంది. కాగా అరబ్, పోర్చుగీస్ జంటకు పుట్టిన సమీర తనకు భారతీయ సంప్రదాయంతో సంబంధముందంది.
నా కలనెరవేరబోతోంది
Published Wed, Sep 17 2014 10:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement