పశ్చిమ పర్వత శ్రేణుల్లోని తేని జిల్లా వేదికగా ఏర్పాటుకు తలబెట్టిన ఇండో బెస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం బయలుదేరనుంది. ఇందు కోసం ఓ ఇయక్కం(సమాఖ్య) ఏర్పాటుకు సామాజిక కార్యకర్త మేథా పాట్కర్, ఎండీఎంకే నేత వైగో నిర్ణయించారు. ప్రజా మద్దతును కూడ గట్టుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో అత్యంత ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం తేని అన్న విషయం అందరికీ తెలిసిందే. ముల్లై పెరియా ర్ డ్యాంకు కూత వేటు దూరంలో, ఆ నదీ పరివాహక ప్రదేశంలో ఈ తేని కొలువుదీరి ఉంది. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాం తంలోని బొడి కొండలను వేదికగా చేసుకుని ఇండో బెస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం ఆ పరిసర వాసుల్లో ఆందోళన బయలు దేరింది. వాతావరణ పరిశోధనల్లో విప్లవాత్మక అడుగులు లక్ష్యంగా నిర్మించ బోతున్న ఈ కేంద్రం ద్వారా తమ జీవనాధారం దెబ్బ తినే ప్రమాదం ఉందని, ముల్లై పెరియార్ డ్యాం నీళ్లు తమకు దక్కకుండా చేస్తున్నారన్న ఆగ్రహంతో ఆ పరిసర వాసులు ఉన్నారు.
భారీ ఉద్యమం : ఆ కేంద్రం పరిసరాల్లోని 20కు పైగా గ్రామాల ప్రజల్లో ఇప్పటికే కంటి మీద కునుకు కరువైంది. ఎలాం టి ముప్పు వస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కొండల్ని, అడవుల్ని పిప్పిచేస్తుండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన రెట్టిం పు అయింది. ఆ కేంద్రం తమకు వద్దంటూ వ్యతిరేకించే పనిలో పడ్డారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా తొలుత ఎండీఎంకే నేత వైగో తన గళాన్ని విప్పా రు. ఆ కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో పాటుగా, ప్రజల్ని ఏకం చేసే పనిలో పడ్డారు. తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఈ కేంద్రం నిర్మితం అవుతున్న దృష్ట్యా, దీన్ని అడ్డుకుందామంటూ అటు కేరళ ప్రజల్ని, పార్టీలకు పిలుపు నిచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాండీ, ప్రతి పక్ష నేత అచ్చుదానందన్ను కలుసుకుని మద్దతు కోరా రు.
దేశంలోని పలు పార్టీల నాయకుల్ని కలుస్తూ మద్దతు సేకరిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు అన్నాహజారే, మేథాపాట్కర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసి భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్టు పరిసరాల్లోని 20 గ్రామాల ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ కేంద్రం రూపంలో ఎదురయ్యే ముప్పు, వ్యవసాయానికి ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించారు. ఇయక్కం ఏర్పాటు: తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ఓ ఇయక్కం( సమాఖ్య) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందు కోసం రంగంలోకి సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ దిగారు. ఆదివారం మదురైలో ఎండీఎంకే నేత వైగో, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ మీడియాతో మాట్లాడారు.
ఆ కేంద్రం రూపంలో ఎదురయ్యే ప్రమాదాన్ని వివరించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు భారీ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా వైగో గుర్తు చేశారు. తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని, ఆ కేంద్రాని కి వ్యతిరేకంగా న్యాయ స్థానంలో న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ హెరిటేజ్ జాబితాలో తేని ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని, అలాంటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని తాముఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఓ ఇయక్కం ఏర్పాటు చేయబోతున్నామని ఈసందర్భంగా మేథా పాట్కర్ ప్రకటించారు. దేశంలోని అంద రూ పార్టీలకు అతీతంగా ఈ ఇయక్కంలోకి రావా లని పిలుపు నిచ్చారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా తొలుత నిరసనలు చేపట్టబోతున్నామని, తదనంతరం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆందోళనను ఉధృతం చేయబోతున్నామన్నారు.
‘న్యూట్రినో’ ఉద్యమం
Published Mon, Mar 2 2015 1:53 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్‌మన్ గిల్‌తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్‌లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement