ముంబై: రాష్ట్రంలోనే తొలిసారిగా సోమవారం సీ ప్లేన్ (ఉభయచరం) సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ (ఎంటీడీసీ), మారిటైమ్ ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ మంత్రి ఛగన్ చంద్రకాంత్ భుజ్‌బల్ పచ్చజెండా ఈ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుమీత్ మల్లిక్, ఎంటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ జగదీష్ పాటిల్, సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ సోని, ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్ధ వర్మ, యాంబివాలీ సిటీ సీఈఓ వివేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటక మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ పర్యావరణ రంగం సిగలో ఇదొక కలికితురాయని అన్నారు. పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సేవలతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా రన్ వేలు లేకపోయినప్పటికీ నగరం నుంచి సమీపంలోని ఇతర ప్రాంతాలకు జలమార్గంద్వారా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు ఇవి చేరవేస్తాయి. తొలి విడతలో భాగంగా యాంబీవ్యాలీ లోయ, ములా డ్యాం (మెహరాబాద్/షిర్డీ), పవనాడ్యాం (లోణవాలా), వరస్గావ్ డ్యాం (లావాసా), ధూం డ్యాం (పంచగని, మహాబలేశ్వర్) ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
వచ్చే నెల ఐదో తేదీనుంచి ప్రయాణికులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎంఈహెచ్‌ఏఐఆర్.ఇన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సీ ప్లేన్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో ఒకదానిలో నలుగురు, మరొక మోడల్లో తొమ్మిది మంది ప్రయాణించేందుకు వీలవుతుంది.
ఉభయచర విమానం ప్రారంభం
Published Mon, Feb 24 2014 10:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement