బంగ్లాదేశ్ భారీస్కోరు | Zimbabwe hit by Shakib, Tamim tons | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ భారీస్కోరు

Nov 5 2014 12:36 AM | Updated on Sep 2 2017 3:51 PM

బంగ్లాదేశ్ భారీస్కోరు

బంగ్లాదేశ్ భారీస్కోరు

ఖుల్నా: ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (109), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షకీబుల్ హసన్ (137)లు సెంచరీలు సాధించడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో....

ఖుల్నా: ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (109), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షకీబుల్ హసన్ (137)లు సెంచరీలు సాధించడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 433 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.

మసకద్జ (15), బ్రియాన్ చారీ (21)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 193/3తో రెండో రోజును మొదలెట్టిన బంగ్లాదేశ్‌కు తమీమ్, షకీబ్‌ల జోడి 132 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement