క్వార్టర్స్‌లో యూకీ | yuki enter to quter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో యూకీ

May 11 2017 12:16 AM | Updated on Sep 5 2017 10:51 AM

క్వార్టర్స్‌లో యూకీ

క్వార్టర్స్‌లో యూకీ

ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ క్వార్టర్‌పైనల్లోకి చేరుకున్నాడు.

కర్షి: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ క్వార్టర్‌పైనల్లోకి చేరుకున్నా డు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడేడ్‌ యూకీ 7–5, 7–5తో ఎనిమిదో సీడ్‌ అల్దిన్‌ సెత్కిక్‌ (బోస్నియా హెర్జెగోవినా)పై శ్రమించి విజయం సాధించాడు. దాదాపు 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసిన యూకీ.. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు.

శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, ప్రపంచ 96వ ర్యాంకర్‌ సెర్జీ స్టాకోవ్‌స్కీ (ఉక్రెయిన్‌)తో యూకీ తలపడనున్నాడు. మరోవైపు మరో భారత ప్లేయర్‌ శ్రీరామ్‌ బాలాజీ పోరాటం ముగిసింది. ఎగోర్‌ జెరామిసోవ్‌ (బెలారస్‌)తో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో 3–6, 4–6తో బాలాజీ ఓటమిపాలయ్యాడు. దాదాపు 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో రెండుసార్లు సర్వీస్‌ కోల్పోయిన భారత ప్లేయర్‌ మూల్యం చెల్లించుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement