ఛేజింగ్ స్టార్ ఏం చేస్తాడో? | will virat kohli get big score in semi final against australia? | Sakshi
Sakshi News home page

ఛేజింగ్ స్టార్ ఏం చేస్తాడో?

Mar 26 2015 12:58 PM | Updated on Sep 2 2017 11:26 PM

ఛేజింగ్ స్టార్ ఏం చేస్తాడో?

ఛేజింగ్ స్టార్ ఏం చేస్తాడో?

విరాట్ కోహ్లీ.. టీమిండియా వైఎస్ కెప్టెనే కాకుండా, జట్టులో కీలక ఆటగాడు. మంచి ఛేజింగ్ స్టార్ గా పేరున్న విరాట్ కోహ్లీ.. ఈ కీలక మ్యాచ్ లో రాణిస్తే మాత్రం సగటు క్రికెట్ అభిమాని టీమిండియా విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

సిడ్నీ: విరాట్ కోహ్లీ.. టీమిండియా వైస్ కెప్టెనే కాకుండా, జట్టులో కీలక ఆటగాడు.  మంచి ఛేజింగ్ స్టార్ గా పేరున్న విరాట్ కోహ్లీ.. ఈ కీలక మ్యాచ్ లో రాణిస్తే మాత్రం సగటు క్రికెట్ అభిమాని టీమిండియా విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ  పాకిస్థాన్ పై మ్యాచ్ మినహా పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్న తరువాత మాత్రం కోహ్లీ పెద్దగా ప్రభావం చూపలేదు.

ప్రస్తుతం ఆసీస్ జరుగుతున్న నాకౌట్ పోరులో టీమిండియా చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణం. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ దిగనున్న టీమిండియాకు సమష్టి పోరు అవసరం. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి..  ఆ తరువాత విరాట్ కోహ్లీ బ్యాట్ ను ఝుళిపిస్తే మాత్రం కచ్చితంగా టీమిండియాదే విజయ కేతనం ఎగురవేసే అవకాశం ఉంది. వన్డేల్లో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో దూసుకుపోతున్న విరాట్ రాణిస్తాడా?లేదా అనేది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement