'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం' | We give ourselves a 50-50 chance, McCullum | Sakshi
Sakshi News home page

'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం'

Mar 28 2015 2:19 PM | Updated on Sep 2 2017 11:31 PM

'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం'

'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం'

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ నే కంటిన్యూ చేస్తామని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్‌.

మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా హైరిస్క్ అప్రోచ్ నే కంటిన్యూ చేస్తామని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్‌. గతంలో సెమీస్ వరకూ వచ్చి చతికిలబడిన సందర్భాలను మెకల్లమ్‌ గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ 2015లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్ కు వచ్చామని.. ఫైనల్లో కూడా అదే తరహా ఆటను కనబరిచి  కప్ ను గెలవడానికి యత్నిస్తామన్నాడు. కప్ గెలవడానికి ఇరు జట్లకు 50-50 ఛాన్స్ ఉందన్నాడు.

 

1992 సెమీ ఫైనల్లో తమ ఆశలను పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ హక్ కొల్లగొట్టాడన్నాడు. ఈసారి మాత్రం కప్పు గెలవడానికి తుదికంటూ పోరాడతామన్నాడు. వేగంగా ఆడటమే తనకు తెలిసిన విద్యని ఒక ప్రశ్నకు సమాధానంగా మెకల్లమ్‌ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement