సోలోగానే హ్యాపీగా ఉందంటున్న కోహ్లి! | Virat Kohli-Anushka Sharma break up, Virat seems to be happy | Sakshi
Sakshi News home page

సోలోగానే హ్యాపీగా ఉందంటున్న కోహ్లి!

Feb 9 2016 5:55 PM | Updated on Sep 3 2017 5:17 PM

సోలోగానే హ్యాపీగా ఉందంటున్న కోహ్లి!

సోలోగానే హ్యాపీగా ఉందంటున్న కోహ్లి!

ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ మధ్య బ్రేకప్ వ్యవహారం నిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంది.

ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ మధ్య బ్రేకప్ వ్యవహారం నిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అధికారికంగా ఇటు కోహ్లి గానీ, అటు అనుష్క శర్మగానీ ఈ విషయంలో ఏమీ చెప్పనప్పటికీ వారు విడిపోయారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది. దీనికితోడు ఒంటరిగా ఉండటంలోనే సుఖమున్నదని ఇప్పుడు కోహ్లి పాటలు పాడుకుంటున్నాడట. ప్రేమ విఫలమైనందుకు దేవదాసులా బాధపడటానికి బదులు పార్టీలు, డ్యాన్సులతో అతడు ఉత్సాహంగానే కనిపిస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు.

ఇటీవల నటుడు అంగద్ బేడి పుట్టినరోజు పార్టీ ముంబైలోని ఓ నైట్ క్లబ్‌లో జరిగింది. ఈ విందుకు హాజరైన కోహ్లి ఉత్సాహంగా అందరినీ పలుకరించడమే కాదు.. 'నేను ఒంటరిని.. చలో డ్యాన్స్ చేద్దాం' అంటూ స్టెప్పులు కూడా వేశాడని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది. అనుష్క ఒక 'కంట్రోలింగ్ గర్ల్‌ఫ్రెండ్' అని, తాను ఎప్పుడూ ఆమె చుట్టూ జపం చేయాల్సి వచ్చేదని అతడు సన్నిహితులతో అంటుండగా విన్నామని ఈ పార్టీకి హాజరైన విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

నిజానికి భారత క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క తమ వృత్తిలో బిజీబిజీ షెడ్యూళ్లతో ఇటీవల కాలంలో గడిపారు. ఈ మధ్యకాలంలోనే వారి మధ్య విభేదాలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమికుల రోజున అనుష్కతో గడుపడానికి భారత్-శ్రీలంక టీ-20 సిరీస్‌ నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే, అనుష్క మాత్రం సల్మాన్‌ఖాన్‌తో 'సుల్తాన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. వీరు విడిపోయారన్న వార్తల నేపథ్యంలో గతంలో అనుకున్నట్టు ఈ జంట పెళ్లి చేసుకునేది అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement